కంబదూరులోని పురాతన కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి నెల రోజులపాటు జరిగే పూజా కార్యక్రమంలో భాగంగా 18వ రోజు శనివారం వడ్డే బొమ్మల నాగరాజు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి రోజు బలి పాడ్యమి పురస్కరించుకుని గ్రామంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.