రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పొంకాల వరుణ్ కుమార్ రెడ్డి 581 మార్కులతో మొదటి స్థానం, యం.హాసిని 578 మార్కులతో ద్వితీయ స్థానంలో మండల టాపర్స్ గా నిలిచారు. మేడాపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులే మండల టాపర్స్ గా నిలవడం విశేషం. మండలంలో పదవ తరగతి పరీక్షలలో 71.27 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని 8 జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలల నుండి, మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్ నుండి మొత్తం 456 పరీక్షలకు 326 మంది ఉత్తీర్ణులయ్యారు.