ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నారని, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నేరుగా పూర్తి ఖర్చు ప్రభుత్వాన్ని భరించేలా ముందస్తుగా సహాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.