సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

2చూసినవారు
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారని, అనారోగ్యంతో బాధపడేవారు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అప్లికేషన్లను వెనక్కి పంపకుండా సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించేలా ముందస్తుగా సహాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శెట్టూరు మండలం యరబోరెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్