నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ

26చూసినవారు
నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ
ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భక్త కనకదాసు జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి మంగళవారం పరిశీలించారు. నారా లోకేష్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రవితేజతో కలసి సభా స్థలం ఏర్పాటు, విగ్రహావిష్కరణ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, జయంతి వేడుకలకు వచ్చే కురుబలు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, ప్రజల కోసం చేసే ఏర్పాట్లు గురించి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్