కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో 4 నెలల క్రితం జరిగిన దారుణ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సుకన్య అనే మహిళ తన భర్త హనుమంతును హత్య చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపినట్లు సమాచారం. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సుకన్య, తన కుమార్తెతో గొడవ పడటంతో అసలు విషయం బయటపడింది.