సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తల్లిదండ్రులు ఈరమ్మ, వెంకటన్న మంగళవారం సెట్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నట్లు వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.