కళ్యాణదుర్గంలో శనివారం జరగనున్న భక్త కనకదాస జయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గం చేరుకున్న మంత్రి లోకేశ్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా ప్రజా వేదికకు వెళ్లారు. సర్కిల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని దళితులు ఆగ్రహించి, సర్కిల్లో ధర్నా చేశారు. వెంటనే లోకేశ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.