శుక్రవారం కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ నాయుడు పూలమాలవేసి, పూలబొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రజావేదికకు తరలివచ్చి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని కలసి పూలబొకేలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.