ఎమ్మెల్యే సురేంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పలువురునాయకులు

11చూసినవారు
కళ్యాణదుర్గం ప్రజావేదికలో శుక్రవారం ఎమ్మెల్యే సురేంద్ర బాబును టిడిపి, జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి సంతోషం పంచుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలని జనసేన ఇన్ ఛార్జి బాల్యం రాజేష్ ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్