కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసి, 'మన చెత్త మన బాధ్యత' అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కళాశాల ప్రిన్సిపల్ పీ. హర్షలత తెలిపారు.