ఆర్డీటీ ఆసుపత్రి వద్ద ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత వాతావరణం

545చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆస్పత్రి వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ పర్యవేక్షణలో జేసీబీలతో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ చేపట్టారు.

సంబంధిత పోస్ట్