అనంతపురంలో ఆదివారం జరిగిన తైక్వాండో పోటీల్లో ఉరవకొండలోని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు హాఫీజ్ అహ్మద్, లీషాజ్జా గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. పాఠశాల సిబ్బంది, పట్టణ ప్రజలు విద్యార్థులను అభినందించారు.