కళ్యాణదుర్గం - Kalyandurgam

కామారెడ్డి జిల్లా
వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం
Feb 17, 2026, 18:02 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

వీధి రౌడీలా మాట్లాడుతున్నావు.. నీ బండారం బయటపెడతాం

Feb 17, 2026, 18:02 IST
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, డిసిసి మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సైకోలా ప్రవర్తిస్తున్నారని, ప్రజాప్రతినిధి హోదాను మరచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. షబ్బీర్ అలీపై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.