Oct 02, 2025, 05:10 IST/
చిరంజీవితో సినిమా.. ఆ హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల
Oct 02, 2025, 05:10 IST
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ చిత్రంలో నయనతార చిరంజీవికి జంటగా నటిస్తోంది. దసరా సందర్భంగా ఆమె పోషిస్తున్న 'శశిరేఖ' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న నయనతార పాత్ర కథలో కీలకంగా ఉండబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.