Mar 06, 2026, 08:03 IST/
తిరుమల శ్రీవారి దర్శించుకున్న జాన్వీ కపూర్
Mar 06, 2026, 08:03 IST
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజు సందర్భంగా, మార్చి 6న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పిన్ని మహేశ్వరితో కలిసి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని, తెల్లవారుజామున వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఏప్రిల్ 30, 2026న విడుదల కానున్న రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు.