
కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు
కేరళలో మద్యం మత్తులో ఉన్న సురేష్ అనే వ్యక్తి, ఆదివారం రాత్రి తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ రైలులో టాయిలెట్ నుంచి వస్తున్న మహిళను కాలితో తన్ని రైలు నుంచి తోసేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్నేహితురాలిని కూడా తోసేసేందుకు ప్రయత్నించగా, ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళ స్నేహితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




