శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల అనారోగ్యం, రహదారి ప్రమాదం, కరెంట్ షాక్ తో మరణించిన పరిగి, గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన విలేజ్ సర్వేయర్లు రాజేశ్వరి, రంగప్ప, పవన్ కళ్యాణ్ కుటుంబాలను సంఘం నాయకులు పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను త్వరగా క్లియర్ చేయిస్తామని తెలిపారు. ఈ సంఘటనలు మడకశిర ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.