మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామి

4చూసినవారు
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామి
కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మడకశిర తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆసుపత్రికి వెళ్లి ఉన్నం హనుమంతరాయ చౌదరిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని గుండుమల తిప్పేస్వామి ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్