అగళి శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణమండపం మరియు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూల అలంకరణలు, హనుమద్వ్రతం, హనుమాన్ చాలీసా జపాలు నిర్వహించారు. శ్రీ కేజీ గుప్తా విద్యార్థులు, ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కేఏ వెంకటేష్ కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.