నూతనంగా ఏర్పడిన మడకశిర రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఆనంద్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. మడకశిర తొలి ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టినందుకు సంతోషంగా ఉందని, ప్రజల, రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, డిప్యూటీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.