మడకశిర: పార్కింగ్ లో ఉన్న లారీని మరో లారీ ఢీ

7చూసినవారు
శుక్రవారం మడకశిర మండలం పెనుకొండ రోడ్డులోని జమ్మానిపల్లి గేట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. పార్కింగ్ లో ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా ఢీకొట్టడమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. అయితే, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :