సోమవారం, మడకశిర మండలం భక్తరహాల్లి జిల్లేడుగుంటలో ఎమ్మెల్యే MS రాజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆయన నేరుగా పెన్షన్ డబ్బులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి గుండుమల తిప్పేస్వామి, సచివాలయ అధికారులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.