మడకశిరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో కలిసి పట్టణంలో పర్యటించి, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని భవనాలను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.