మడకశిర మండలం గుండుమల గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ అధికారులతో కలసి గుండుమల తిప్పేస్వామి స్థలాన్ని శనివారం పరిశీలించారు. గుండుమల పంచాయతీలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో మాట్లాడి నూతన సబ్ స్టేషన్ కు అనుమతులు తీసుకువచ్చారని, సాధ్యమైనంత త్వరగా సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామని గుండుమల తెలిపారు.