మడకశిర: సొంతగూటికి వైసీపీ ఎంపీటీసీ

శనివారం, వైయస్సార్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన మడకశిర మండలం వైబిహల్లి ఎంపీటీసీ రంగనాథ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో తిరిగి వైయస్సార్సీపీలో చేరారు. తనకు మాయమాటలు చెప్పి టీడీపీ కండువా కట్టారని రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మడకశిరలో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
