మడకశిరలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
మడకశిర పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ. 34,74,500 లక్షల విలువైన చెక్కులను అందించారు. ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్