స్మశాన వాటికల ఏర్పాటుపై ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అధికారులతో సమీక్ష

3చూసినవారు
స్మశాన వాటికల ఏర్పాటుపై ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అధికారులతో సమీక్ష
మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్లు, ఏపీడీ, ఏపీఓలతో మడకశిర తాలూకాలోని అన్ని గ్రామాల్లో స్మశాన వాటికల ఏర్పాటుపై సమీక్షించారు. స్మశాన వాటికలను త్వరితగతిన వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అగలి మండలం నుంచి ఎంపీడీవో గంగాధర్, తాసిల్దార్ సుబ్బారావు, ఏపీఓ మంజునాథ్ పాల్గొన్నారు. ఈ సమీక్ష శ్రీసత్యసాయి జిల్లా, మడకశిరలో జరిగింది.