ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

0చూసినవారు
ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
మడకశిర పట్టణంలో ఇద్దరు ద్విచక్ర వాహన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం, చెరుకూరి శివప్ప, సాయి ప్రభు అనే ఇద్దరు నిందితులు కొద్దిరోజులుగా వాహనాలను దొంగిలిస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కల్లుమర్రి క్రాస్ వద్ద వీరిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :