అగళి పట్టణం పోలీస్ స్టేషన్ నందు బుధవారం, ఎస్ఐ శోభరాణి ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, ఆటో రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.