ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో కోడి పందేలు, పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో అమరాపురం ఎస్సై వలి బాషా తన సిబ్బందితో శనివారం దాడులు చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, రూ. 23, 850 నగదు, 14 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.