వాగు దాటుతూ కొట్టుకుపోయిన మహిళ మృతి

4చూసినవారు
శనివారం, అనంతపురం జిల్లా మడకశిర మండలం బేగార్లపల్లి వద్ద వాగులో గల్లంతైన గీతమ్మ (30) అనే మహిళ మృతి చెందింది. ఆమె తన తమ్ముడితో కలిసి వాగు దాటుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. గీతమ్మ మృతదేహాన్ని గ్రామస్తులు వాగు మలుపు వద్ద గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గీతమ్మ తమ్ముడు చెట్టుకొమ్మను పట్టుకొని సురక్షితంగా బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్