Jan 21, 2026, 07:01 IST/కామారెడ్డి
కామారెడ్డి
గురుకుల పాఠశాల ప్రవేశ గడువు పొడిగింపు: 25 వరకు దరఖాస్తులు
Jan 21, 2026, 07:01 IST
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ గోపీచంద్ రాథోడ్ తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ గడువు పొడిగింపు జరిగింది. ప్రజాప్రతినిధులు బీద పిల్లలను గుర్తించి, వారి కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందేలా కృషి చేయాలని, తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.