Nov 08, 2025, 09:11 IST/
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఆ రెండు రోజులు 144 సెక్షన్
Nov 08, 2025, 09:11 IST
ఈనెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ పోలీసు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ స్టేషన్ పరిధిలోని 200 మీటర్ల వరకు ఐదు లేదా ఎక్కువ మంది ఒకే చోట గుమ్మి కూడడం నిషేధం. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు, అలాగే ఫలితం వెల్లడించే నవంబర్ 14న ఉదయం 6 నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు టపాసులు పేల్చడం కూడా నిషేదించారు.