Apr 18, 2026, 18:04 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కామారెడ్డి డిక్టరేషన్ అమలు చేయకుంటే ఆందోళన తప్పదు
Apr 18, 2026, 18:04 IST
రాష్ట్రంలో ముదిరాజ్ జనాభాను 20 లక్షల వరకు తగ్గించి చూపడం సరికాదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శనివారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని తెలిపారు. తమకు రిజర్వేషన్లు, మత్స్య శాఖలో సముచిత స్థానం కల్పించాలని, కార్పొరేషన్కు రూ. 5 వేల కోట్లు కేటాయించి ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు.