పెద్దవడుగూరు - Pedavaduguuru

కామారెడ్డి జిల్లా
క్షేత్ర సహాయకులకు నగదు బహుమతి అందజేసిన జిల్లా కలెక్టర్
Apr 13, 2026, 19:04 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

క్షేత్ర సహాయకులకు నగదు బహుమతి అందజేసిన జిల్లా కలెక్టర్

Apr 13, 2026, 19:04 IST
హైదరాబాద్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు, కామారెడ్డి ఐడీఓసీ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ యాప్‌లో ముఖ గుర్తింపు ఆధారిత నమోదు ద్వారా అత్యధిక కూలీల హాజరు నమోదు చేసిన క్షేత్ర సహాయకులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సత్కరించారు. నాగిరెడ్డిపేట్ మండలం లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన ఎస్. అంజయ్య (238 కూలీల నమోదు), సదాశివనగర్ మండలం మర్కల్ కె. రాములు (216 కూలీల నమోదు), బిక్కనూరు మండలం తిప్పాపూర్ కు చెందిన కె. నరేష్ (197 కూలీల నమోదు) లకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రశంసా పత్రాలు అందజేశారు.