శాంతి భద్రతల పరిరక్షణ, చోరీల నియంత్రణకు వినూత్న శ్రీకారం...

4చూసినవారు
శాంతి భద్రతల పరిరక్షణ, చోరీల నియంత్రణకు వినూత్న శ్రీకారం...
శ్రీసత్య సాయి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చోరీల నియంత్రణకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను అరికట్టేందుకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పరిగి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రంగడు పాత నేరస్తులు, రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తితో చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్