పెనుకొండ మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చిన సీఐటీయూ...

4చూసినవారు
పెనుకొండ మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చిన సీఐటీయూ...
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ కు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నట్లు సమ్మె నోటీసు అందజేశారు. కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 12వ పిఆర్సి, జీతాల పెంపు వంటి డిమాండ్లను సాధించుకోవడానికి ఈ సమ్మె చేపడుతున్నట్లు యూనియన్ నాయకులు నాగరాజు, చిన్న వెంకటేష్ తెలిపారు.