రోడ్డు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం పెనుకొండలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మంత్రి సవిత భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో వై జంక్షన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.