గోరంట్ల మండలం వడిగేపల్లిలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలకు దీపం 3 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అనంతరం, గ్రామంలో 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా పాల్గొన్నారు.