విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ యాటంగిరి రాంప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రాంప్రసాద్‌కు, డైరెక్టర్లకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.