జగన్ హయాంలో అన్నీ కల్తీలే... మంత్రి సవిత

6చూసినవారు
జగన్ హయాంలో అన్నీ కల్తీలే... మంత్రి సవిత
గోరంట్లలో పర్యటించిన మంత్రి సవిత, శనివారం మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాల మనోభావాలతో ఆడుకున్నారని, రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, జగన్ కల్తీ గురించి మాట్లాడటం విడ్డూరమని, ఆయన ఏ విషయంలో కల్తీ చేయలేదో చెప్పాలని నిలదీశారు. జగన్ తన ఉనికికోసం, చిల్లర రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :