ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు.. మంత్రి

2చూసినవారు
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు.. మంత్రి
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత గురువారం అమరావతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ. 85 కోట్ల భారం పడుతుందని ఆమె వెల్లడించారు.