గోరంట్ల: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా..

14చూసినవారు
గోరంట్ల: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా..
గోరంట్ల మండల జనసేన నాయకులు సంతోష్, సురేష్, వెంకటేష్ లు మాజీ మంత్రి ఉషశ్రీపై తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, అక్రమాలపై ప్రశ్నించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్న మీరు, అప్పట్లో మీ నాయకులు గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన అసాంఘిక కార్యక్రమాలపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉషశ్రీకి ఉందా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్