ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పాస్టర్ కుల ధ్రువపత్రాలన్నీ రద్దు చేయండి: హైకోర్టు
Apr 29, 2026, 06:04 IST/

పాస్టర్ కుల ధ్రువపత్రాలన్నీ రద్దు చేయండి: హైకోర్టు

Apr 29, 2026, 06:04 IST
క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ చింతాడ ఆనంద్ మోసపూరితంగా పొందిన ఎస్సీ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ బాధితుడు అక్కల రామిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. మతం మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని, పాస్టర్ ఆనంద్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని హైకోర్టు పేర్కొంది. పాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, బాపట్ల జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, పిట్లలవానిపాలెం తహశీల్దారులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.