సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి....

2చూసినవారు
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి....
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. అమరావతిలో బుధవారం మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయుల స్వామి, ఎన్ఎండీ ఫరూక్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై చర్చించారు. మెనూ అమలు, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రత, సాంకేతిక విద్య పకడ్బందీగా అందించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, ఆహారం, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్