రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవితను, చేనేత నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు బుధవారం సన్మానించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించడంతో, మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.