కంది కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

15చూసినవారు
కంది కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
రొద్దం మండలం రాగిమేకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కందుల కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించి, అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఆర్డివో టీ. ఆనంద్ కుమార్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మార్క్‌ఫెడ్ అధికారులు, రొద్దం తహశీల్దార్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్