హెల్మెట్ లేదని యువకుడి తల్లికి మంత్రి ఫోన్

0చూసినవారు
పెనుకొండలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సవిత, ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. NH-7పై బైకులను ఆపి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా, రూ.2.5 లక్షల విలువైన బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని మంత్రి అడ్డుకున్నారు. అతని తల్లికి ఫోన్ చేసి, కొడుకు హెల్మెట్ ధరించేలా చూడాలని హెచ్చరించారు. రూ.2 లక్షల బైక్ కొనగలరు కానీ హెల్మెట్ కొనలేరా అని ప్రశ్నించి, యువకుడికి హెల్మెట్ ఇచ్చి పంపారు.

సంబంధిత పోస్ట్