పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం, నియోజకవర్గానికి చెందిన నూతనంగా నియమితులైన 8 మంది ఆశా కార్యకర్తలకు మంత్రి సవిత నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారులు, కూటమీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.